అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ! ఆయనపై FIR నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2019లో దాఖలైన పిటిషన్‌ను కోర్టు పరిగణించింది. కేజ్రీవాల్, గులాబ్ సింగ్, నితికా శర్మలపై హోర్డింగ్‌ల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 18 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం జారీ అయ్యింది.

అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ! ఆయనపై FIR నమోదు చేయాలని కోర్టు ఆదేశం
Arvind Kejriwal

Updated on: Mar 11, 2025 | 6:12 PM

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయిన బాధలో ఉన్న ఆయనకు ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. 2019 లో దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు, ఆ పిటిషన్ ను స్వీకరించి, మార్చి 18 వరకు కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, ద్వారక మాజీ కౌన్సిలర్ నితికా శర్మ ఉద్దేశపూర్వకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. వారందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పుడు కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. మరి ఈ కేసులో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.