దేశంలో నడిచే వేలాది రైళ్లు అప్పుడప్పుడు ఆలస్యంగా స్టేషన్‌కు రావడం మామూలే. అయితే వాస్కోడిగామా – హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మాత్రం ప్రయాణికలందరికి షాకిచ్చింది. ఏకంగా 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్‌కు ఈ రైలు ఉదయం 10.35 గంటలకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ రైలును మళ్లించగా ఉదయం 9.05 గంటలకే ఆ స్టేషన్‌కు వచ్చింది. అయితే అనుకున్న సమయానికి ఆ స్టేషన్‌కు వెళ్లాలనుకున్న ప్రయాణికులు అక్కడికి రాకపోవడంతో.. ఆ ట్రైన్ స్టేషన్‌కు వచ్చి ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
వాస్తవానికి ఆ స్టేషన్‌లో 45 మందిని ఆ రైలు తీసుకెళ్లాల్సింది. కానీ 9.45 -10 గంటల మంది ప్రయాణికులు అక్కడికి రావడంతో ట్రైన్ వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకోని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు వెంటనే ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు చేయాలంటూ స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు ఇక చేసేదేమి లేక వీరి కోసం గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్ నిలుపుచేయించి.. దానిలో జల్గావ్‌కు పంపించారు. వారు వచ్చేదాక గోవా ఎక్స్‌ప్రెస్‌ను అక్కడ ఆపేశారు. దీంతో పరిస్థితి సద్దుమునిగింది. రైలు ముందుగా రావడంపై రైల్వే సిబ్బంది స్పందించారు. పొరపాటు జరిగిందని.. దీనిపై విచారణ కూడా ప్రారంభించామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం