Arvind Kejriwal: విశ్వాసపరీక్షలో నెగ్గిన సీఎం కేజ్రీవాల్‌.. ఆప్‌ సర్కార్‌కు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యేలు..

ఆప్‌ సర్కార్‌కు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అసెంబ్లీలో ఆప్‌కు 61 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉండగా..

Arvind Kejriwal: విశ్వాసపరీక్షలో నెగ్గిన సీఎం కేజ్రీవాల్‌.. ఆప్‌ సర్కార్‌కు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యేలు..
Arvind Kejriwal

Updated on: Sep 01, 2022 | 2:21 PM

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో నెగ్గారు సీఎం కేజ్రీవాల్‌. ఆప్‌ సర్కార్‌కు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అసెంబ్లీలో ఆప్‌కు 61 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉండగా.. ఒకరు జైలులో ఉన్నారు . మరో ఎమ్మెల్యే స్పీకర్‌ స్థానంలో ఉన్నారు. ఢిల్లీలో ఆపరేషన్‌ లోటస్‌ విఫలమయ్యిందన్నారు కేజ్రీవాల్‌. 40 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు కేజ్రీవాల్‌. ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగలేదన్నారు. అయితే ఓటింగ్‌ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ బయట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్‌ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. లిక్కర్‌ స్కాంలో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను బర్తరఫ్‌ చేయాలని నినాదాలు చేశారు.

6300 కోట్ల విలువైన ఎమ్మెల్యేలను కొనండి: అరవింద్ కేజ్రీవాల్

సిఎం కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ, “నేను ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పాఠశాల, ఆసుపత్రిగా మారాలనుకుంటే.. వారు నాపై ఈ కేసు పెట్టారు.” పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించకుండా దేశం పురోగమించగలదా అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను 20-20, 50-50 కోట్లకు కొంటున్నారని.. ఈ బీజేపీ వాళ్లు రూ.6300 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. దాని వల్లే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీపై ఆరోపణలు చేశారు. 

మరిన్ని జాతీయ వార్తల కోసం