నెల రోజుల పోరాటం.. కరోనాతో కన్నుమూసిన ఎయిమ్స్ మాజీ విద్యార్థి

| Edited By:

Sep 15, 2020 | 1:25 PM

ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివిన ఓ యువ డాక్టర్ కరోనాతో కన్నుమూశారు. దాదాపు నెల రోజుల పాటు ఆ మహమ్మారితో పోరాటం చేసిన యువ వైద్యుడు

నెల రోజుల పోరాటం.. కరోనాతో కన్నుమూసిన ఎయిమ్స్ మాజీ విద్యార్థి
Follow us on

Young doctor dies of corona: ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివిన ఓ యువ డాక్టర్ కరోనాతో కన్నుమూశారు. దాదాపు నెల రోజుల పాటు ఆ మహమ్మారితో పోరాటం చేసిన యువ వైద్యుడు సోమవారం తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వికాస్ సోలం(25)కి అనే డాక్టర్‌కి నెల రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం క్షీణిస్తూ రావడంతో వికాస్‌ని జజ్జర్‌లోని ఎయిమ్స్ క్యాంపస్‌కి తరలించారు. ఇక శనివారం అతడి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు.

మొదట్లో వికాస్‌కి ఎలాంటి లక్షణాలు లేవని, అయితే ఆ తరువాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అతడి పరిస్థితి విషమించిందని ఎయిమ్స్ డాక్టర్ అజయ్ మోహన్ తెలిపారు. మరోవైపు వికాస్ మరణంతో ఇటు కుటుంబంలోనూ, అటు ఎయిమ్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికాస్ మంచి టాపర్ అని, అందరితో కలివిడిగా ఉండేవారని వారు అంటున్నారు. జీవితంపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారని వారు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లలో చాలా మందిని ఈ వైరస్ బలిగొన్న విషయం తెలిసిందే.

Read More:

విశాఖ హనీట్రాప్ గూఢచర్యం కేసు.. మరొకరికి అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

చిరు ‘అర్బన్ మాంక్‌’ లుక్.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్