చిరు ‘అర్బన్ మాంక్‌’ లుక్.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్

అర్బన్ మాంక్ అంటూ ఇటీవల గుండు లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే

చిరు 'అర్బన్ మాంక్‌' లుక్.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2020 | 11:52 AM

Chiranjeevi Urban Monk Look: అర్బన్ మాంక్ అంటూ ఇటీవల గుండు లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ లుక్‌ ఎలా సాధ్యమైందో చెబుతూ దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు చిరు. ”ఆ వీడియోకు మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్‌. ప్రతి ఒక్కరు నమ్మేలా లుక్‌ని మేకోవర్ చేసే ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కి థ్యాంక్స్‌. సినిమా మ్యాజిక్‌కి సెల్యూట్‌” అంటూ కామెంట్ పెట్టారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉండగా.. మెగా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరుగుతోంది. అయితే ఈ గెటప్ ఏ సినిమా కోసం అన్నది చిరంజీవి రివీల్ చేయలేదు.

కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై ఇటు మోగాభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

తన తొలి చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోన్న కీర్తి

దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ఇంటికి అనుమతి

https://www.instagram.com/tv/CFJNTF9DGW3/?utm_source=ig_embed