అర్ధరాత్రి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లిన ఫ్రెండ్స్.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి.. పట్టనట్టున్న తల్లిదండ్రులు

|

Nov 15, 2024 | 6:15 PM

ఇంట్లో వాళ్లకు తెలియకుండా అర్ధరాత్రి వేళ ఏడుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. అనుకోని రీతిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. దీంతో వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. కానీ వీరి కుటుంబ సభ్యులు మాత్రం పిల్లలు చనిపోయారన్న ఆవేదన ఏమాత్రం లేనట్లు ప్రవర్తిస్తున్నారు. దీనిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

అర్ధరాత్రి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లిన ఫ్రెండ్స్.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి.. పట్టనట్టున్న తల్లిదండ్రులు
Road Accident
Follow us on

ఉత్తరాఖండ్‌, నవంబర్‌ 15: డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు యువతీ యువకులు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వయసున్న వారే. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో తమ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నా కుటుంబ సభ్యులు మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. అసలేం జరిగిందంటే..

డెహ్రాడూన్‌లో ONGC చౌక్ వద్ద తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ ట్రక్కు వెనుక భాగానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు యువతీ యువకులు ఉన్నారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు. 25ఏళ్ల సిద్ధేష్‌ అగర్వాల్‌ అనే యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. సినర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధేష్‌ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కంటెయినర్ ట్రక్ డ్రైవర్ తప్పు ఏంలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వేగంగా వస్తున్న MUV కారు.. ట్రక్కు వెనుక ఎడమ భాగాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు సైతం ఫిర్యాదు చేయలేదు. మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒక

ఇవి కూడా చదవండి

రాజ్‌పూర్ రోడ్లు, సహరాన్‌పూర్ చౌక్, బల్లివాలా, బల్లూపూర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో వీరి కారు సాధారణ వేగంతో కదులుతున్నట్లు సీసీటీవీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే ఓఎన్‌జీసీ కూడలికి చేరుకోగానే కారు ఒక్కసారిగా వేగం పెంచడంతో ప్రమాదానికి దారితీసినట్లు తెలిపారు. కేసు నమోదు చేయడానికి మృతుల కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు కోసం వేచి చూస్తున్నామని కాంట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ KC భట్ తెలిపారు. అందుకే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.