భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ

| Edited By:

Aug 17, 2019 | 7:05 PM

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు. అక్కడ మోదీకి అత్యంత ప్రముఖుల కిచ్ఛే గౌరవ వందనం లభించింది. హైడ్రో-పవర్ రంగంలో భారత్-భూటాన్ మధ్య భాగస్వామ్యం మోదీ పర్యటనతో బలోపేతమవుతుందని భావిస్తున్నారు. స్పేస్,ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ ఇరు దేశాల […]

భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ
Follow us on

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు. అక్కడ మోదీకి అత్యంత ప్రముఖుల కిచ్ఛే గౌరవ వందనం లభించింది. హైడ్రో-పవర్ రంగంలో భారత్-భూటాన్ మధ్య భాగస్వామ్యం మోదీ పర్యటనతో బలోపేతమవుతుందని భావిస్తున్నారు. స్పేస్,ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. పారో విమానాశ్రయం నుంచి భూటాన్ రాజధాని థింపూ వరకు దారి పొడవునా అక్కడి విద్యార్థులు, మహిళలు ఉభయ దేశాల జాతీయ పతాకాలను చేతబట్టుకుని మోదీకి స్వాగతం పలికారు. అటు-ఆయనను భూటాన్ ప్రధాని లోటే ప్రశంసలతో ముంచెత్తారు. తమ దేశ 12 వ పంచ వర్ష ప్రణాళిక కోసం ఇండియా రూ. 5 వేల కోట్ల సాయాన్ని అందజేస్తున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత-భూటాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకునేందుకు మోదీ పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఆయన రెండు రోజులపాటు భూటాన్ లో పర్యటించనున్నారు.