మరణశిక్షలు మృగాళ్లను ఆపుతాయా ? సారీ ! నా ఉద్దేశం అది కాదు !

|

Dec 02, 2019 | 9:16 AM

హైదరాబాద్ లో వైద్యురాలు దిశాపై జరిగిన హత్యాచారంపై స్పందించిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో.. చటుక్కున ఓ మాట అనేసి ఆ తరువాత దాన్ని సవరించుకున్నారు. ఉరిశిక్ష వంటి అత్యంత కఠిన శిక్షలు విధించినా ఇలాంటి మృగాళ్లు సమాజంలో కొనసాగుతూనే ఉంటారని, ఏవిధమైన పనిష్మెంట్ ఇఛ్చినా ఇలాంటి నేరాలను ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు. అది మరణశిక్ష అయినా సరే.. దుండగులు తాము ఏదో విధంగా బయటపడతామనే ధీమాతో ఉన్నారని ఆయన అన్నారు. అయితే రేపిస్టులకు మరణ శిక్షలు విధించరాదని […]

మరణశిక్షలు మృగాళ్లను ఆపుతాయా ? సారీ ! నా ఉద్దేశం అది కాదు !
Babul Supriyo
Follow us on

హైదరాబాద్ లో వైద్యురాలు దిశాపై జరిగిన హత్యాచారంపై స్పందించిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో.. చటుక్కున ఓ మాట అనేసి ఆ తరువాత దాన్ని సవరించుకున్నారు. ఉరిశిక్ష వంటి అత్యంత కఠిన శిక్షలు విధించినా ఇలాంటి మృగాళ్లు సమాజంలో కొనసాగుతూనే ఉంటారని, ఏవిధమైన పనిష్మెంట్ ఇఛ్చినా ఇలాంటి నేరాలను ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు. అది మరణశిక్ష అయినా సరే.. దుండగులు తాము ఏదో విధంగా బయటపడతామనే ధీమాతో ఉన్నారని ఆయన అన్నారు. అయితే రేపిస్టులకు మరణ శిక్షలు విధించరాదని ఈయన కోరుతున్నారా అన్న విమర్శలు వెల్లువెత్తడంతో.. సుప్రియో తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.

అది తన ఉదేశ్యం కాదని, డీఎన్ఏ టెస్టులో మృగాళ్లు శిక్షార్హులని తేలితే.. వారిని ఆకలి గొన్న కుక్కలకో లేదా , ఫైరింగ్ స్కాడ్ కో ‘ బలి ‘ చేయాలని నేను అనుకుంటున్నానని, కానీ బహిరంగగా అలా అనజాలనని ఆయన పేర్కొన్నారు. అసలు ఇలాంటి దారుణాలు గురించి విన్నప్పుడు తన కళ్ళ ముందే కీచకులను కాల్చివెయ్యాలని కోరుతున్నానని, తనకూ ఇద్దరు కూతుళ్లు ఉన్నారని బాబుల్ సుప్రియో అన్నారు. తలిదండ్రులు రాత్రి పొద్దుపోయాక తమ కుమార్తెలు ఆలస్యంగా రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా,, 2012 నాటి నిర్భయపై హత్యాచారం కేసులో నిందితుడు వినయశర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని ఢిల్లీ హోం మంత్రి… లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపిన ఫైలులో కోరారు. దీనికి అనుగుణంగా గవర్నర్ తన సిఫారసులతో కేంద్ర హోంశాఖకు పంపాలని కూడా ఆయన అభ్యర్థించారు.