స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్.. ఆసుపత్రికి తరలింపు

| Edited By:

Dec 15, 2019 | 6:11 PM

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక నేరాల అదుపునకు గట్టి చర్యలు తీసుకోవాలని, దోషులకు ఆరు నెలల్లోగా కఠిన శిక్షలు విధించాలని కోరుతూ దీక్ష చేస్త్నున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆదివారం స్పృహ కోల్పోయారు. ఆమెను వెంటనే లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారంతో ఆమె దీక్ష 13 వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ లో దిశ హత్యాచారంపైనా స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించిన విషయం […]

స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్.. ఆసుపత్రికి తరలింపు
Follow us on

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక నేరాల అదుపునకు గట్టి చర్యలు తీసుకోవాలని, దోషులకు ఆరు నెలల్లోగా కఠిన శిక్షలు విధించాలని కోరుతూ దీక్ష చేస్త్నున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆదివారం స్పృహ కోల్పోయారు. ఆమెను వెంటనే లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారంతో ఆమె దీక్ష 13 వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ లో దిశ హత్యాచారంపైనా స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించిన విషయం విదితమే..

ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఏపీ దిశ చట్టం-2019 ‘ ఆమోదించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ ఆమె ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. కాగా.. దీక్ష విరమించాలని, లేని పక్షంలో కిడ్నీ ఫెయిల్యూర్ కాగలదని ఆమెను డాక్టర్లు హెచ్చరించారు. అయితే స్వాతి మాలివాల్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఆమెను ఆసుపత్రిలో ఇంట్రా వీనస్ పై ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.