AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశ్మీర్ లో ల్యాండ్ కావాలా ? అయితే 15 ఏళ్ళ స్థానికత ఉంటేనే ఆ ఛాన్స్ !

Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 6:17 PM

Share

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆస్తులు కొనాలంటే ఇక కొత్త నిబంధనలు అడ్డురానున్నాయి. స్థానికులు కానివారు భూములు, ఫ్లాట్లు , ఇతర స్థిరాస్తులు కొనడానికి అర్హులు కాబోరు. అంటే తప్పనిసరిగా లోకల్ గా 15 సంవత్సరాలు నివాసం ఉండాల్సిందే.. ఇందుకు అనువుగా కేంద్రం సరికొత్త పాలసీని అమల్లోకి తేనుంది. ‘ డామిసైల్ స్టేటస్ కి ఇది అనివార్యమని అంటున్నారు. లడఖ్ కూడా ఇందుకు మినహాయింపు కాదని, పదిహేను సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నట్టు ఆధారాలు చూపాల్సి […]

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆస్తులు కొనాలంటే ఇక కొత్త నిబంధనలు అడ్డురానున్నాయి. స్థానికులు కానివారు భూములు, ఫ్లాట్లు , ఇతర స్థిరాస్తులు కొనడానికి అర్హులు కాబోరు. అంటే తప్పనిసరిగా లోకల్ గా 15 సంవత్సరాలు నివాసం ఉండాల్సిందే.. ఇందుకు అనువుగా కేంద్రం సరికొత్త పాలసీని అమల్లోకి తేనుంది. ‘ డామిసైల్ స్టేటస్ కి ఇది అనివార్యమని అంటున్నారు. లడఖ్ కూడా ఇందుకు మినహాయింపు కాదని, పదిహేను సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నట్టు ఆధారాలు చూపాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా కేవలం స్థానికులైనవారికి సివిల్ సర్వీసులు, ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. అయితే పారిశ్రామికవేత్తలకు, ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు ఏర్పాటు చేయాలనుకునే బిజినెస్ వర్గాలకు మాత్రం ఈ వెసులుబాటు ఉండదు. అలాగే అధికారుల పిల్లలకు, వారి కుటుంబాల విషయంలో సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసిన అనంతరం ఈ రాష్ట్రంతో బాటు లడఖ్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. దేశంలోని ఇతర ప్రజలకు కల్పిస్తున్న ప్రయోజనాల మాదిరే వీరికి కూడా వాటిని కల్పిస్తున్నామని, ప్రత్యేక హోదా వల్ల ఇక్కడి ప్రజలకు కలిగే ఇతర ప్రయోజనాలు స్వల్పమేనన్నది కేంద్రం భావన.

Published on: Dec 15, 2019 05:22 PM