క్షీణిస్తున్న స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం

|

Dec 16, 2019 | 1:13 PM

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. అయినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఇప్పటికీ శిక్ష అమలు చేయలేదు. దీంతో రేప్‌ దోషులను 6 నెలల్లోగా కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో..10రోజుల క్రితం నిరాహార దీక్షకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని సమతాస్థల్‌ వద్ద దీక్ష చేస్తున్న స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఎల్‌ఎన్‌జేపీ […]

క్షీణిస్తున్న స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం
Follow us on

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. అయినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఇప్పటికీ శిక్ష అమలు చేయలేదు. దీంతో రేప్‌ దోషులను 6 నెలల్లోగా కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో..10రోజుల క్రితం నిరాహార దీక్షకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌.

ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని సమతాస్థల్‌ వద్ద దీక్ష చేస్తున్న స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి సెలైన్‌ ఎక్కించేందుకు ప్రయత్నించడంతో..అందుకు ఆమె నిరాకరించారని తెలిపారు కమిషన్ సభ్యుడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.