దాద్రానగర్‌ హహేలిలో భారీ పేలుడు.. నలుగురి మృతి , పలువురికి సీరియస్..!

దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్వాస్‌లోని దేమానీ రోడ్డులోని నైట్రోజన్ గ్యాస్ గిడ్డంగిలో జరిగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ విషాద ఘటనలో నలుగురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దాద్రానగర్‌ హహేలిలో భారీ పేలుడు.. నలుగురి మృతి , పలువురికి సీరియస్..!
Explosion In Nitrogen Gas Warehouse

Updated on: Apr 04, 2026 | 2:11 PM

దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్వాస్‌లోని దేమానీ రోడ్డులోని నైట్రోజన్ గ్యాస్ గిడ్డంగిలో జరిగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ విషాద ఘటనలో నలుగురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

శనివారం (ఏప్రిల్ 04) ఉదయం గిడ్డంగిలో కార్మికులు నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లను నింపుతున్నారు. అకస్మాత్తుగా ఒక సిలిండర్ పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి గిడ్డంగిలోని కొంత భాగం దెబ్బతిని, శిథిలాలు రోడ్డుపైకి ఎగిరిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. ఆ పేలుడు శబ్దం 30 మీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. అటుగా వెళ్తున్న పాఠశాల విద్యార్థులు, స్థానిక నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భూకంపం లాంటి ప్రకంపనలు కూడా తమకు అనిపించినట్లు తెలిపారు.

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అగ్నిమాపక దళ వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక, రెస్క్యూ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మృతులలో గిడ్డంగి మేనేజర్ కూడా ఉన్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనపై నిష్పక్షపాత విచారణకు యంత్రాంగం ఆదేశించింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియలోని నిర్లక్ష్యం ఏ మేరకు జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us