
సూపర్ సైక్లోన్ ఉమ్‌పున్ ఉరుముతోంది. తీరం వెంట ఉప్పెనలా తరుముకొస్తోంది. ఇవాళ మధ్యాహ్నానికి తీవ్రమైన తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఉన్న పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో విస్తరించిన ఉమ్‌పున్.. ఉత్తర ఈశాన్యం వైపు 14కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో పెనుతుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 200కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయన్నారు. ఇప్పటికే ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 20 ఏళ్లలో రెండో అతిపెద్ద సూపర్ సైక్లోన్‌గా దీన్ని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. బుల్బుల్ తుపాను వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే ఉమ్‌పున్ మరింత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
తుఫాన్ ఎఫెక్ట్ బెంగాల్, ఒడిశాలో ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో బెంగాల్, ఒడిశాలకు 41 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. వారికి శాటిలైట్ ఫోన్లు, వైర్‌లెస్ సమాచారం పరికరాలు అందించారు. 1999లో సంభవించిన సైక్లోన్‌ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సైన్యం, నౌకాదళానికి చెందిన సహాయక బృందాలను సైతం అందుబాటులో ఉంచినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. అంతర్వేది తీరంలో సముద్రం 50 మీటర్లు ముందుకు రాగా.. అలల అలజడి కొనసాగుతోంది. ఒడిశా, బెంగాల్ అధికారులతో నిత్యం సమీక్ష చేసుకుంటూ ఎక్కువ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ అధికారులు.
Over 1 lakh people evacuated from 13 vulnerable districts in Odisha as cyclone Amphan hurtles towards Bengal coast
Read @ANI Story | https://t.co/AHESfusm7k pic.twitter.com/lXH4jH2VWD
— ANI Digital (@ani_digital) May 20, 2020
#WATCH: Rainfall and strong winds hit Bhadrak in Odisha. #CycloneAmphan is expected to make landfall today. pic.twitter.com/X8xF9aZ6cf
— ANI (@ANI) May 19, 2020