‘పెట్రో నిరసన’.. సైకిల్ తొక్కిన డిగ్గీ రాజా

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2020 | 7:59 PM

కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సైకిల్ తొక్కారు. భోపాల్ లోని ఓ ప్రధాన కూడలి నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకు కిలోమీటర్ దూరం మేరా ఈ సైకిల్ యాత్ర..

పెట్రో నిరసన.. సైకిల్ తొక్కిన డిగ్గీ రాజా
Follow us on

కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సైకిల్ తొక్కారు. భోపాల్ లోని ఓ ప్రధాన కూడలి నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకు కిలోమీటర్ దూరం మేరా ఈ సైకిల్ యాత్ర కొనసాగింది. ఆయనతో బాటు పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పాలక బీజేపీ, కేంద్రం రెండూ కూడా డబ్బు సంపాదించేందుకు ఈ కరోనా వైరస్ ఎపిడమిక్ ని ఉపయోగించుకుంటున్నాయని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. పెట్రోలు, డీసెల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం వరుసగా ఎనిమిదో రోజు పెంచిందని అయన దుయ్యబట్టారు. కరోనా ‘డిజాస్టర్’ అన్నది మోడీ ప్రభుత్వానికి డబ్బు సంపాదించడానికే తోడ్పడుతుందన్నారు. అటు-కరోనా పాండమిక్ ని, పెట్రో ఉత్పత్తుల ధరలను మోదీ ప్రభుత్వం ‘అన్ లాక్’ చేసిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.  సామాన్య ప్రజల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.