Heroin Smuggling – IGI: రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా.. 90 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేసిన అధికారులు..

|

Nov 14, 2021 | 7:46 AM

Heroin Smuggling - IGI: డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. రోజు రోజు వ్యూహాలు మారుస్తూ.. అధికారులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు.

Heroin Smuggling - IGI: రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా.. 90 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేసిన అధికారులు..
Herion
Follow us on

Heroin Smuggling – IGI: డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. రోజు రోజు వ్యూహాలు మారుస్తూ.. అధికారులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. మరి అధికారులేమైనా తక్కువా.. వారి ఎత్తులను చిత్తు చేస్తూ.. మాఫియా రవాణా చేస్తున్న డ్రగ్స్‌ని పట్టుకుంటున్నారు. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. విదేశాల నుంచి తీసుకువస్తున్న హెరాయిన్‌ను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇది 12.9 కేజీలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు ఉగాండా దేశస్తులు ఈ హెరాయిన్‌ను తీసుకుని నైరోబియా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కాగా, విమానాశ్రయం అధికారులు సీజ్ చేసిన ఈ హెరాయిన్‌ను నార్కోటిక్ అధికారులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు నార్కోటిక్ అధికారులు.

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంయలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి AI 952 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 671.9 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడు జుసర్‌లో బంగారం దాచి లగేజీ బ్యాగ్‌లో పెట్టుకుని తరలిస్తుండగా.. అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.34.18 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also read:

Horoscope Today: ఈ రాశుల వారు ఖర్చులు చేస్తారు.. అనారోగ్య సమస్యలు ఉంటాయి.. ఈరోజు రాశి ఫలాలు..

Home Loan: ఇంటి కోసం తీసుకున్న లోన్ ముందస్తుగా చెల్లించడం వలన లాభం ఉంటుందా? టాక్స్ ప్రయోజనం లభిస్తుందా? తెలుసుకోండి!

Hyderabad: మిస్సింగ్ భార్గవి సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. ఇంతకీ ఆమె ఎక్కడికెళ్లిందంటే..