ఈ కుక్క చాలా లక్కీ… ఎందుకో చూడండి మీరే..!

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వడోదర పట్టణంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తోంది. దీంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బయటకు ఎటూ వెళ్లలేని పరిస్థితితో పాటుగా.. వీరికి ఓ ప్రాణసంకటం వచ్చిపడింది. అక్కడి వరద నీటిలో మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని చూసిన స్థానికులు.. భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ శునకమైతే.. ఆ మొసలి నోటిదాక వెళ్లి ప్రాణాలతో  బయట  పడింది. వరద నీటిలో […]

ఈ కుక్క చాలా లక్కీ... ఎందుకో చూడండి మీరే..!

Edited By:

Updated on: Aug 02, 2019 | 2:59 AM

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వడోదర పట్టణంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తోంది. దీంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బయటకు ఎటూ వెళ్లలేని పరిస్థితితో పాటుగా.. వీరికి ఓ ప్రాణసంకటం వచ్చిపడింది. అక్కడి వరద నీటిలో మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని చూసిన స్థానికులు.. భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ శునకమైతే.. ఆ మొసలి నోటిదాక వెళ్లి ప్రాణాలతో  బయట  పడింది. వరద నీటిలో ఓ రెండు కుక్కలు.. అటు ఇటు తిరగుతుండగా ఓ మొసలి వాటిని గమనించింది. మెల్లిగా వాటిని అనుసరించి.. చివరకు ఓ కుక్కపై దాడిచేయబోయింది. వెంటనే అలర్ట్ అయిన ఆ కుక్క పక్కకు జంప్ చేసి.. ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.