India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?

|

Apr 26, 2022 | 10:05 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం అందోళన కలిగిస్తుంది.

India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?
Coronavirus
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం అందోళన కలిగిస్తుంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 2,483 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 58 కేసులు తగ్గాయి. నిన్న 1399 మరణాలు నమోదయ్యాయి. అయితే.. పలు రాష్ట్రాల్లో నమోదైన మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 15,636 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనా కేసులు, రికవరీల వివరాలు.. ఇలా

    • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569 కి చేరింది.
    • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,23,622 కి పెరిగింది.
    • నిన్న కరోనా నుంచి 1,970 మంది కోలుకున్నారు.
    • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,23,311 కి చేరింది.
    • ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.75 శాతం ఉంది.
    • ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,95,76,423 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
    • నిన్న 22,83,224 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కట్టడికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు లేఖ సైతం రాసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

Also Read:

Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో సింపుల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు..

JCB Bulldozer: సోషల్ మీడియా నుంచి పొలిటికల్ వరకు బుల్డోజర్లపై చర్చ.. దీని ధర ఎంతంటే..