Fine: కరోనా కాలంలో నో మాస్క్.. రూ.58 కోట్ల జరిమానాలు కట్టిన మహానగర వాసులు..

|

Jun 25, 2021 | 5:54 AM

COVID-19 in Mumbai: దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ప్యూ లాంటి ఆంక్షలు

Fine: కరోనా కాలంలో నో మాస్క్.. రూ.58 కోట్ల జరిమానాలు కట్టిన మహానగర వాసులు..
Masks
Follow us on

COVID-19 in Mumbai: దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ప్యూ లాంటి ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో ఎక్కువగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు, మరణాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో కేసులు, మరణాల పరంగా మొదటి నుంచి మహారాష్ట్రనే ముందు వరుసలో ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతోపాటు మొదట్లో కోవిడ్ కేంద్రంగా మారిన ముంబైలో కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జ‌రిమానాలు విధించారు.

అయితే.. బీఎంసీలో మాస్క్ పెట్టుకోకుండా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరుగుతున్న వారి నుంచి ఇప్పటివరకూ రూ. 58 కోట్ల జ‌రిమానా వ‌సూల్ చేశారు. జూన్ 23వ తేదీ వ‌ర‌కు ఆ మొత్తాన్ని వ‌సూలు చేసినట్లు బీఎంసీ వెల్లడించింది. ముంబై సివిల్ పోలీసుల‌తో పాటు రైల్వే శాఖ ఈ మొత్తం నగదును మాస్క్‌లేని వారి నుంచి వ‌సూలు చేసినట్లు పేర్కొంది. అయితే.. మ‌హారాష్ట్ర‌లో సెకండ్ వేవ్ స‌మ‌యంలో అత్య‌ధిక స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిత్యం 60 నుంచి 70 వేల వరకూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

Also read:

‘పిల్లలు ఎందుకు అంత త్వరగా పెరుగుతారు’.. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసిన ప్రియాంక గాంధీ

Prasar Bharati e-office: ఉద్యోగుల పని మొత్తం ఆన్‌లైన్‌లోనే.. ఈ-ఆఫీస్‌కు మారిపోయిన ప్రసార భారతి