India Corona: ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కరోనా కేసులు.. దేశంలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయంటే..

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 27 ఉదయం వరకు 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనావైరస్ సోకిన వ్యక్తులు ఉన్నారు. దక్షిణాసియా దేశాలలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. దీంతో భారతదేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

India Corona: ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కరోనా కేసులు.. దేశంలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయంటే..
India Coronavirus Cases

Updated on: May 29, 2025 | 8:23 AM

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 27 ఉదయం వరకు 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనావైరస్ సోకిన వ్యక్తులు ఉన్నారు. దక్షిణాసియా దేశాలలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. దీంతో భారతదేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కరోనా వేరియంట్లు NB.1.8.1, LF.7 గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారతదేశంలో COVID-19 కేసుల వివరాలు..

భారత్ లో 1009 కోవిడ్ 19 యాక్టివ్ కేసులున్నాయని.. ఇటీవల 752 కేసులు నిర్ధారించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తరువాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్ణాటకలో 47, గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47 మంది, ఉత్తరప్రదేశ్‌లో 15 మంది, పశ్చిమ బెంగాల్‌లో 12 మంది, తమిళనాడులో 69 మంది, రాజస్థాన్‌లో 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ఒకటి, ఏపీలో 4 కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. అండమాన్ – నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు నివేదించలేదని ప్రకటనలో తెలిపింది.

దేశంలో COVID-19 కేసులు పెరగడంతో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే, తేలికపాటి, సూక్ష్మ లక్షణాలతోనే కేసులు నమోదవుతున్నాయని.. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ రాజీవ్ బెహ్ల్ అన్నారు. గతంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి తీవ్రమైనది కాదని.. ఇంట్లో చికిత్స పొందవచ్చని చెప్పింది. ఈ రకమైన కరోనా ఇన్ఫెక్షన్‌ను చురుగ్గా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..