India Covid: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరసగా రెండో రోజు 8వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 7447 మంది కరోనా వైరస్ బారినపడినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,47,26,049లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్ వలన 4,76,869 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 12,16,011 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. కొవిడ్ కారణంగా. 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్‌గా ఉండగా గురువారం రాత్రి వరకు దేశ వ్యాప్తంగా 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.
అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టగా.. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత అధికమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
Also Read: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే..