Curfew in Delhi: ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుంచి వాచ్చే సోమవారం ఉదయం (26వ తేదీ) వరకూ కర్ఫ్యూ విధించనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలో రెండు రోజుల పాటు వీకెండ్ లాక్‌డౌన్ సైతం నిర్వహించారు. దీంతోపాటు కొన్ని రోజులుగా.. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 26వ తేదీ వరకూ ఢిల్లీ ప్రాంతమంతా పకడ్బంధీ కర్ఫ్యూను విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
కాగా.. ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి నిత్యం వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గంటకు వేయి కేసులలకు పైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కేసులు పెరుగుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా చేసి చర్యలు తీసుకుంటోంది. ఆదివారం ఢిల్లీలో 25,462 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. గత 24 గంటల్లో 167 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 30 శాతం పెరిగింది. ప్రతీ ముగ్గురిలో ఒక్కరికి పాజిటివ్‌గా నిర్థారణ అవుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యలో నిన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రాజధానిలోని ఆసుపత్రులలో 100 కన్నా తక్కువగా ఐసీయూ బెడ్లు ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించి మహమ్మారి కట్టడికి సహకరించాలని సూచించారు.
Also Read: