Corona Second Wave: అక్కడా.. ఇక్కడా కాదు.. ఎక్కడన్నా సరే.. ఎవరినైనా సరే.. అందర్నీ చుట్టేస్తోన్న కరోనా రెండో వేవ్!

|

Apr 20, 2021 | 7:33 PM

కరోనా మొదటిసారి వచ్చినపుడు దానిగురించి ఏమీ తెలియక పోవడం వలన అందరూ జాగ్రత్త పడ్డారు. ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో.. డాక్టర్లు ఎలా చెబితే అలా విన్నారు. మాస్క్ పెట్టండి అంటే పెట్టారు.. గంట కొట్టండి అంటే కొట్టారు..

Corona Second Wave: అక్కడా.. ఇక్కడా కాదు.. ఎక్కడన్నా సరే.. ఎవరినైనా సరే.. అందర్నీ చుట్టేస్తోన్న కరోనా రెండో వేవ్!
Corona Virus
Follow us on

Corona Second Wave: కరోనా మొదటిసారి వచ్చినపుడు దానిగురించి ఏమీ తెలియక పోవడం వలన అందరూ జాగ్రత్త పడ్డారు. ఏం చేస్తే ఏమవుతుందో అనే భయంతో.. డాక్టర్లు ఎలా చెబితే అలా విన్నారు. మాస్క్ పెట్టండి అంటే పెట్టారు.. గంట కొట్టండి అంటే కొట్టారు.. అన్నీ బంద్ ఎక్కడికీ కదలొద్దు అంటే సాధ్యమైనంత వరకూ పాటించారు. మెల్లగా కాలం మారింది.. కాలంతో పాటు కరోనా తీరూ మారింది. దానిని దెబ్బ కొట్టేశాం అనే ధీమా జనంలో పెరిగింది. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ దీనికి భయపడటం మానేశారు. కరోనా.. వస్తుంది..పోతుంది.. అంతే అనే ధీమాకు వచ్చేశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ రావడంతో హా ఏమవుతుంది? కరోనా కోరలు పీకేశాం కదా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది. మొదటి వేవ్ లో ఎక్కువగా సామాన్యులు కరోనా బారిన పడి ఆసుపత్రుల వద్ద క్యూలు కట్టారు. కానీ ఈ రెండో వేవ్ లో వాళ్ళూ వీళ్ళూ అని లేదు అందరూ క్వారంటైన్ బాట పట్టే పరిస్థితి వచ్చింది. కరోనా ప్రజా నేతలను ఈసారి మొత్తంగా చుట్ట పెట్టేస్తోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఫాం హౌస్లో ఐసోలేషన్ కి వెళ్ళిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే ఎన్నికల కమిషనర్లు ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారని తెలుస్తోంది.

ఈసారి ఈ వేవ్ పొలిటికల్ వేవ్ గా మారిపోయింది. ప్రజలతో సంబంధం ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు, మంత్రులు ఇలా రాజకీయ నాయకులకు కరోనా దెబ్బ గట్టిగానే తగులుతోంది. ఇక చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు కరోనా పాజిటివ్ గా తేలడం. ఒక్కసారి మొదటి రెండో వేవ్ లో కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు ఎవరో చూద్దాం..

  • జులై13, 2020 ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‍ బాషాకు కరోనా పాజిటివ్
    తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‍ ఆసుపత్రికి (స్విమ్స్) లో చికిత్స
  • జులై25, 2020 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా.. భోపాల్ లోని ఆసుపత్రికి తరలింపు, చికిత్స
  • సెప్టెంబర్2, 2020 గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ కి కరోనా.. లక్షణాలు లేని కారణంగా హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స
  • సెప్టెంబర్ 23, 2020 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్ వైరస్‌ పాజిటివ్..
  • నవంబర్ 15, 2020 మణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కు క‌రోనా పాజిటివ్.. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స
  • డిసెంబర్11, 2020 మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మా కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లో చికిత్స
  • డిసెంబర్12, 2020 ఉత్తరాంఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ కు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ లో చికిత్స
  • ఏప్రిల్7, 2021త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్.. హోమ్ ఐసొలేషన్‌లో చికిత్స
  • ఏప్రిల్8, 2021…కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్.. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక కరోనా, స్వీయ నిర్భంధం
  • ఏప్రిల్14, 2021 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా పాజిటివ్..
  • ఏప్రిల్16, 2021 కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు కరోనా పాజిటివ్.. రెండోసారి కరోనాబారిన పడ్డ యెడ్యూరప్ప
  • ఏప్రిల్‌ 19,2021 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌, రెండో సారి కరోనా బారిన పడ్డ కేసీఆర్‌
  • ఏప్రిల్‌ 19,2021 మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కరోనా పాజిటివ్ నిర్దారణ.. ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న మన్మోహన్‌ సింగ్‌

కరోనా ఎవరినీ వదిలిపెట్టదు అనేది స్పష్టం అయింది. జాగ్రత్తగా ఉండకపోతే కచ్చితంగా కరోనా కాటేస్తుంది. ఎన్నో జాగ్రత్తల మధ్య.. ప్రత్యెక ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రులనే వారు ఎక్కడో తెలిసో తెలియకో చేసిన చిన్న పొరపాటుతో వదిలిపెట్టని కరోనా భూతం.. మరి అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా ఉంటె సాధారణ ప్రజలను ఎందుకు వదిలిపెడుతుంది? కరోనాకి అవన్నీ తెలియవు. తెలిసింది మాస్క్ ఉందా లేదా.. ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారా లేరా.. ఈ రెండే.. మాస్క్ లేకపోయినా.. ఒకరిని ఒకరు అంటిపెట్టుకుని గుంపుగా ఉన్నా కరోనా రక్కసి ఆకలి తీరిపోతుంది. దాని ఆకలి తీర్చలనుకుంటే నిర్లక్ష్యం చేయండి.. లేదంటే.. జాగ్రత్తగా ఉండండి అంతే!

Also Read: Coronavirus: కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం… వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్న నేతలు

CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..