Corona Lockdown: మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్.. ఏప్రిల్ 9 నుంచి అన్నీ బంద్.. కఠిన ఆంక్షలు అమలు.!

|

Apr 08, 2021 | 10:53 AM

Corona Lockdown: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు..

Corona Lockdown: మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్.. ఏప్రిల్ 9 నుంచి అన్నీ బంద్.. కఠిన ఆంక్షలు అమలు.!
Lockdown
Follow us on

Corona Lockdown: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో తాత్కాలిక లాక్‌డౌన్ విధించాయి. ఇదే కోవలో తాజాగా ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపధ్యంలో ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో 11 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ లాక్‌డౌన్ ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఛత్తీస్‌గడ్‌లో మంగళవారం 9,921 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా రాయ్‌పూర్‌లోనే వెలుగుచూశాయి. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య అధికారులతో సుదీర్ఘ చర్చ జరిగి రాజధానిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఏప్రిల్ 14వ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!