కరోనా ఎఫెక్ట్.. ప్రధాని మోదీ బ్రసెల్స్ పర్యటన వాయిదా

| Edited By: Anil kumar poka

Mar 05, 2020 | 6:23 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన బ్రసెల్స్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. బ్రసెల్స్ రాజధాని బెల్జియంలో.. ఇండియా-యూరోపియన్ సమ్మిట్ జరగవలసి ఉంది.

కరోనా ఎఫెక్ట్.. ప్రధాని మోదీ బ్రసెల్స్ పర్యటన వాయిదా
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన బ్రసెల్స్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. బ్రసెల్స్ రాజధాని బెల్జియంలో.. ఇండియా-యూరోపియన్ సమ్మిట్ జరగవలసి ఉంది. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసేందుకు ఉద్దేశించి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. పైగా మోదీ టూర్ కి అనుగుణంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో బ్రస్సెల్స్ సందర్శించి వచ్చారు కూడా.. కాగా మోదీ ఈ సమయంలో ఆ దేశానికి వెళ్లడం సబబు కాదని ఇరు దేశాల ఆరోగ్య శాఖ అధికారులు సూచించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అందువల్ల ఉభయ దేశాలకూ అనువైన తేదీల్లో ఈ సమ్మిట్ ను రీషెడ్యూల్ చేయనున్నట్టు ఆయన వివరించారు. బెల్జియంలో నిన్నటి వరకు 23 కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం అందింది.