విదారక ఘటన.. పోలీసులను 7 కిలో మీటర్లు మోసుకెళ్లిన గ్రామస్తులు!

హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పీతీ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల ప్రజలు, సైనికులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైన మంచుకి  కొందరు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. దగ్గరలో ఆస్పత్రులు లేకపోవడంతో.. పోలీసు సిబ్బందిని అత్యవసర వైద్యం కోసం తరలించేందుకు గ్రామస్థులు, అధికారులు ఆపసోపాలు పడ్డారు. గజగజ వణికించే చలిలో దాదాపు 7 కిలోమీటర్ల వరకూ కాలినడకన మంచుమార్గంలోనే వారిని మోసుకొని వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో […]

విదారక ఘటన.. పోలీసులను 7 కిలో మీటర్లు మోసుకెళ్లిన గ్రామస్తులు!

Edited By:

Updated on: Jan 18, 2020 | 11:24 AM

హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పీతీ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల ప్రజలు, సైనికులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైన మంచుకి  కొందరు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. దగ్గరలో ఆస్పత్రులు లేకపోవడంతో.. పోలీసు సిబ్బందిని అత్యవసర వైద్యం కోసం తరలించేందుకు గ్రామస్థులు, అధికారులు ఆపసోపాలు పడ్డారు. గజగజ వణికించే చలిలో దాదాపు 7 కిలోమీటర్ల వరకూ కాలినడకన మంచుమార్గంలోనే వారిని మోసుకొని వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.