కూలీకి దొరికిన రూ.1.4 లక్షల ఫోన్..అతను చేసిన పనికి అందరూ షాక్

|

Mar 22, 2023 | 12:07 PM

రోడ్డుపై వెళ్తున్నుప్పుడు లేదా బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లో గాని ఉన్నప్పుడు లేదా ఇంకే చోటైన ఉన్నప్పుడు ఏదైన వస్తువు దొరికితే కొంతమంది దాన్ని తీసుకుని దాచిపెట్టుకుంటారు.

కూలీకి దొరికిన రూ.1.4 లక్షల ఫోన్..అతను చేసిన పనికి అందరూ షాక్
Railway Station
Follow us on

రోడ్డుపై వెళ్తున్నుప్పుడు లేదా బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లో గాని ఉన్నప్పుడు లేదా ఇంకే చోటైన ఉన్నప్పుడు ఏదైన వస్తువు దొరికితే కొంతమంది దాన్ని తీసుకుని దాచిపెట్టుకుంటారు. మరికొంతమంది దాన్ని తీసుకోరు. ఇంకా మంచి మనసు కలిగినవారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా ఆ వస్తువును అప్పగిస్తారు. ఇలాంటి కోవలోకే చెందుతాడు మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ కూలి. అతనికి రూ.1.4 లక్షల విలువైన ఓ ఫోన్ దొరికితే దాన్ని పోలీసులకు వెళ్లి అప్పగించాడు. వివరాల్లోకి వెళ్తే దశరథ్ డౌండ్(62) అనే వ్యక్తి దాదర్ రైల్వే స్టేషన్ లో దాదాపు 30 ఏళ్లుగా కూలీగా పనిచేస్తున్నాడు. అతని సంపాదన రోజుకు కేవలం రూ.300 మాత్రమే. అయితే సోమవారం రోజున రాత్రి 11.40 గంటలకు దశరథ్ రైల్వే్ స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నంబర్ లో తన పని ముగించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనే ప్రయాణికులు కూర్చునే చోట అతనికి ఓ ఫోన్ కనిపించింది.

కానీ దశరథ్ ఆశతో ఆ ఫోన్ ను దాచిపెట్టలేదు. అక్కడున్న ప్రయాణికులను ఈ ఫోన్ మీదేనా అంటూ అడిగాడు. కానీ వాళ్లెవ్వరు మాది కాదని చెప్పారు. దీంతో దశరథ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగించాడు. ఇలా తమకు తెలియని వాళ్ల ఫోన్ అప్పగించడంపై ముందుగా పోలీసులు దశరథ్ ను అభినందించారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఎవరిదీ అని ట్రాక్ చేయగా బాలివుడ్ బాద్ షా అమితాబచ్చన్ మేకప్ ఆర్టిస్టు దీపక్ సావంత్ దని గుర్తించారు. తన ఫోన్ ను పోలీసులకు దశరథ్ అప్పగించడం విషయాన్ని తెలుసుకున్న దీపక్ సవంత్ ఆ కూలికి రూ.1000 బహుమానం అందించాడు. ఇంత మంచి పని చేసిన ఆ కూలీని పోలీస్ సిబ్బంది, దీపక్ సవంత్ కుటుంబ సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..