Watch Video: వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన ట్రక్కు.. నుజ్జునుజ్జైన 20 కార్లు.. వీడియో చూడండి!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సాయంత్రం ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి దాదాపు 20 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 19 మంది గాయాపడ్డారు. 20 కార్లు మొత్తం నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Watch Video: వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన ట్రక్కు.. నుజ్జునుజ్జైన 20 కార్లు.. వీడియో చూడండి!
Accident

Updated on: Jul 27, 2025 | 8:43 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సాయంత్రం ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి దాదాపు 20 కార్లను ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఈ ప్రమాదం ముంబై వైపు వెళ్తుండగా ఫుడ్ మాల్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. లోనావాలా ఘాట్ నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక భారీ కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్‌ స్పీడ్‌ ఎక్కువగా ఉండడంతో సుమారు 20కి పైగా కార్లు, ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి.

ప్రమాదానికి గురైన వాహనాల్లో ఎక్కువ శాతం ఖరీదైన ఎస్‌యూవీ కార్లే ఉన్నాయి. వాటిలో బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్కువేగంగా వచ్చి ఢీకొట్టడంతో..ముందున్న వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. కొన్ని ఒకదానిపైకి ఒకటి పడిపోయాయి. ప్రమాదానికి గురైన వాహనాల్లో చాలా వరకు ముందు భాగాలు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం సాయంత్రం వేళ జరగడంతో ఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది.

వీడియో చూడండి..

ఇదికూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కాపాడాలంటూ యువతి ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టించిన ఘటన!

స్థానిక వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, హైవే ప్రెటోలింగ్‌, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ సహాయంతో త్వరితగతిన స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించి రోడ్‌ను క్లిక్ చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమా మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.