Sonia Gandhi COVID-19: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగరాం ఆస్పత్రికి తరలింపు..

|

Jun 12, 2022 | 3:12 PM

సోనియా గాంధీ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో సోనియాను ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో తరలించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు.

Sonia Gandhi COVID-19: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగరాం ఆస్పత్రికి తరలింపు..
Sonia Gandhi
Follow us on

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో సోనియాను ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో తరలించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. కోవిడ్ తర్వాత అతను కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.  సోనియా గాంధీకి 10 రోజుల క్రితం కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదే సమయంలో ప్రియాంక గాంధీ సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సోనియా ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఆమె పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలు పడుతుందని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజుల క్రితం చెప్పారు. సోనియాకు ఆస్తమా సమస్య ఉన్నట్లుగా వారి ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ అరూప్ బసు తెలిపారు. గతంలో ఛాతీ ఇన్ఫెక్షన్లు, కడుపు ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఫిబ్రవరి 2020లో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆపై సాధారణ పరీక్షల కోసం జూలైలో చేరారు.