YS Jagan Meets PM Modi: నిధులే ప్రధాన అజెండా.. ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ..

|

Dec 28, 2022 | 4:10 PM

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిసి దాదాపు గంటపాటు ప్రత్యేకంగా సమావేశామయ్యారు.

YS Jagan Meets PM Modi: నిధులే ప్రధాన అజెండా.. ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ..
Ys Jagan Meets Pm Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిసి దాదాపు గంటపాటు ప్రత్యేకంగా సమావేశామయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ సుధీర్ఘంగా ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే సీఎం జగన్ ప్రధానంగా ప్రధాని మోడీతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల అదేవిధంగా ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలపై మోడీకి వివరించారు. దీంతోపాటు విభజన సమస్యలు, మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీతో 45 నిమిషాల పాటు చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌ ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు. విభజన జరిగి 8 ఏళ్లు గడిచిపోయాయని.. ప్రత్యేక హోదాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ చట్టంలో చాలా అంశాల్ని నెరవేర్చలేదని.. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని వివరించారు. పోలవరం పెండింగ్‌ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. పునరావాసం కోసం అడహాక్‌గా రూ.10,485 కోట్లు పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం జగన్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Ys Jagan Meets Pm Modi

కాగా, సీఎం జగన్ రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..