రేపటి నుంచి వంద శాతం కెపాసిటీతో సినిమా థియేటర్లు.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

Jan 31, 2021 | 11:12 AM

కరోనా మహమ్మారి వల్ల మూతపడ్డ సినిమా థియేటర్లు రేపటి నుంచి పూర్తిస్థాయి కెపాసిటీతో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం..

రేపటి నుంచి వంద శాతం కెపాసిటీతో సినిమా థియేటర్లు.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Follow us on

కరోనా మహమ్మారి వల్ల మూతపడ్డ సినిమా థియేటర్లు రేపటి నుంచి పూర్తిస్థాయి కెపాసిటీతో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు పది నెలల తర్వాత సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్‌ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లోని సినిమా హాళ్లు పూర్తిస్థాయి కెపాసిటితీఓ తిరిగి ప్రారంభించడానికి అనుమతులు లభించాయి.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌లాక్‌ 5 మార్గదర్శకాల ప్రకారం.. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని శరతు విధించింది. అదేవిధంగా సినిమా ప్రదర్శన సమయాలలో వ్యత్యాసం ఉండాలని పేర్కొంది. అయతే తాజా మార్గదర్శకాల ప్రకారం థియేటర్లు వంద శాతం ప్రేక్షకుల కెపాసిటీతో నుడుపుకునేందుకు అనుమతి లభించింది. అయితే కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రేక్షకులు మరియు సిబ్బంది సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకుల నుంచి ఫోన్ నంబర్లను తప్పనిసరిగా తీసుకోవాలిని సూచించింది.

సినిమా ప్రారంభానికి ముందు మరియు సినిమా చివరలో కోవిడ్-భద్రతా నిబంధనలు మరియు అవి పాటించబడకపోతే విధించే శిక్షలను ప్రసారం చేస్తారు. ప్రేక్షకునికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే థియేటర్‌లోకి అనుమతించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. థియేటర్లు కూడా డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తాయి. టికెట్‌ కౌంటర్లను తరచుగా శానిటైజేషన్ చేయాలని కేంద్రం సూచించింది.