అధిక వడ్డి ఇప్పిస్తానంటూ బురిడి కొట్టించాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ ఆశ చూపి జనాలను మోసం చేయడంమే కాకుండా అరెస్టై బెయిల్ పై వచ్చి పరారైన నిందితులను 29 ఏళ్ల తర్వాత సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని తిరువనంతపురానికి చెందిన టీజే జాన్‌ తన మిత్రులైన టీజే మాథ్యూ, ఎంఎం టోమీ, షెర్లీ టోమీ (70), సీఐ జోసెఫ్‌ (67) లతోపాటు మొత్తం పది మందితో కలిసి ట్రావెన్‌కోర్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ అనే పేరుతో హైదరాబాద్‌లో 1986లో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు.

అధిక వడ్డి ఇప్పిస్తానంటూ బురిడి కొట్టించాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Fixed Deposits
Image Credit source: TV9 Telugu

Updated on: Apr 26, 2023 | 6:35 AM

అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ ఆశ చూపి జనాలను మోసం చేయడంమే కాకుండా అరెస్టై బెయిల్ పై వచ్చి పరారైన నిందితులను 29 ఏళ్ల తర్వాత సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని తిరువనంతపురానికి చెందిన టీజే జాన్‌ తన మిత్రులైన టీజే మాథ్యూ, ఎంఎం టోమీ, షెర్లీ టోమీ (70), సీఐ జోసెఫ్‌ (67) లతోపాటు మొత్తం పది మందితో కలిసి ట్రావెన్‌కోర్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ అనే పేరుతో హైదరాబాద్‌లో 1986లో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు.తమవద్ద డిపాజిట్‌ చేస్తే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించాడు. దాంతో చాలామంది వారివద్ద డిపాజిట్లు చేశారు. ఇలా మొత్తం రూ.12,54,915 వసూలు చేశారు. అందులో రూ.94,921 మాత్రమే తిరిగి చెల్లించారు. మిగతా రూ.11.50 లక్షలకు పైగా సొమ్ముతోపాటు వడ్డీని చెల్లించకుండా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

 

దీంతో 1987లో వారిపై హైదరాబాద్‌లో కేసు నమోదయింది. 1994 జనవరి 29న ఎంఎం టోమీ, షెర్లీ టోమీ, సీఐ జోసెఫ్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యారు. దీంతో అప్పటి నుంచీ వారిపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు పెండింగ్‌లో ఉంది. పాత కేసుల సమీక్షలో భాగంగా ఈ విషయాలన్ని బయటపడటంతో సీఐడీ అదనపు డీజీ మహేష్‌భగవత్‌ వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కేరళ వెళ్లిన ఈ బృందం షెర్లీ టోమీ , సీఐ జోసెఫ్‌ లను అరెస్టు చేసి హైదరాబాద్‌‌కు తీసుకొచ్చారు.అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. 41 ఏళ్ల వయసులో పరారైన షెర్లీ టోమీ 70 ఏళ్ల వయసులో తిరిగి అరెస్టు కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..