లద్దాఖ్.. రెండు కి.మీ. వెనక్కి వెళ్లిన చైనా సేనలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 09, 2020 | 1:34 PM

భారత-చైనా దళాల 'పాక్షిక ఉపసంహరణ' కొనసాగుతోంది. లద్ధాఖ్ వాస్తవాధీన రేఖ పొడవునా ఫిక్షన్ (నిర్దేశిత) పాయింట్ల వద్ద చైనా దళాలు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్టు భారత సైనిక వర్గాలు తెలిపాయి..

లద్దాఖ్.. రెండు కి.మీ. వెనక్కి వెళ్లిన చైనా సేనలు
Follow us on

భారత-చైనా దళాల ‘పాక్షిక ఉపసంహరణ’ కొనసాగుతోంది. లద్ధాఖ్ వాస్తవాధీన రేఖ పొడవునా ఫిక్షన్ (నిర్దేశిత) పాయింట్ల వద్ద చైనా దళాలు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్టు భారత సైనిక వర్గాలు తెలిపాయి. పెట్రోలింగ్ పాయింట్-15 వద్ద డిస్ ఎంగేజ్ మెంట్ ప్రక్రియ బుధవారం పూర్తయిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా సమీపంలో ఈ నెల 7 నఉభయ దళాలూ   వెనక్కి మళ్ళిన సంగతి తెలిసిందే. గత ఆదివారం నుంచి చైనా సేనలు ఈ ప్రాంతంలో తమ టెంట్లను తొలగించి.. తమ సైనిక శకటాలను వెనక్కి తరలించాయి. అయితే చైనా శకటాలు ఇప్పటికీ గాల్వన్ నదీ ప్రాంతంలో అలాగే ఉన్నాయి. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా- ‘పాక్షిక ఉపసంహరణ’ ముగిశాక మళ్ళీ ఉభయ దేశాల సైనికాధికారులు నాలుగో విడత చర్చలు జరపనున్నారు.