చైనా వ్యాక్సీన్ల ‘ఎగ్జిబిషన్’ చూతము రారండి !

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సీన్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే చైనా వోళ్లు మాత్రం అప్పుడే 'వ్యాక్సీన్ల ఎగ్జిబిషన్' పెట్టేశారు. మొట్టమొదటిసారిగా  బీజింగ్ లో నిర్వహించిన ట్రేడ్ ఫెయిర్

చైనా వ్యాక్సీన్ల 'ఎగ్జిబిషన్' చూతము రారండి !
Coronavirus Vaccine
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 7:27 PM

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సీన్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే చైనా వోళ్లు మాత్రం అప్పుడే ‘వ్యాక్సీన్ల ఎగ్జిబిషన్’ పెట్టేశారు. మొట్టమొదటిసారిగా  బీజింగ్ లో నిర్వహించిన ట్రేడ్ ఫెయిర్ (ప్రదర్శన) లో వ్యాక్సీన్ లిక్విడ్లతో కూడిన చిన్నపాటి ‘వైల్స్’ బుజ్జి టాయ్స్ లా కనిపిస్తున్నాయి. చైనా కంపెనీలు సినోవాక్ బయోటెక్, సైనో ఫామ్ ఈ వ్యాక్సీన్లను తయారు చేశాయి. అయితే ఇవి ఇంకా మార్కెట్ లోకి ఎంటర్ కాలేదు. ఈ సంవత్సరాంతంలోగా మూడో దశ ట్రయల్స్ ముగియగానే వీటికి ఆమోద ముద్ర పడుతుందని ఈ కంపెనీలు ఆశిస్తున్నాయి. ఏడాదికి 30 కోట్ల డోసుల  వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని తమ కంపెనీ సాధించిందని సినోవాక్ బయో టెక్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ గేమ్ ఛేంజింగ్ టీకా మందును చూసేందుకు జనం సోమవారం ఎగబడ్డారట.

కరోనా వైరస్ మహమ్మారికి తామే కారణమని ప్రపంచ దేశాలు తమవైపు వేలెత్తి చూపుతుంటే.. దీన్ని తామే అరికట్టగలుగుతున్నామని చాటేందుకు డ్రాగన్ కంట్రీ తహతహలాడుతోంది. ‘మా సక్సెస్ స్టోరీని మీరే చూద్దురు గాని’ అని వూహన్ సిటీ మరీ గొంతు చించుకుంటోంది.  మూడో దశ ట్రయల్స్ కి ఎంటర్ కాగలవని భావిస్తున్న పది వరల్డ్ వైడ్ వ్యాక్సీన్లలో చైనావారి ఈ టీకా మందులు కూడా ఉన్నాయి. అయితే వీటికి ఇంకా ఆమోదముద్ర పడాల్సి ఉంది.