భారత దళాలపై దాడికి చైనాయే ఆదేశించిందా ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 23, 2020 | 4:00 PM

గాల్వన్ వ్యాలీలో భారత సైనికులపై దాడి చేయాలని చైనాలోని ఓ సీనియర్ సైనికాధికారి తమ సైన్యాన్ని ఆదేశించారా ? దీనివల్లే ఉభయ దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు రేగి.. భారీ ఘర్షణ జరిగిందా ? అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. చైనాలో వెస్టర్న్ థియేటర్ కమాండ్..

భారత దళాలపై దాడికి చైనాయే ఆదేశించిందా ?
Follow us on

గాల్వన్ వ్యాలీలో భారత సైనికులపై దాడి చేయాలని చైనాలోని ఓ సీనియర్ సైనికాధికారి తమ సైన్యాన్ని ఆదేశించారా ? దీనివల్లే ఉభయ దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు రేగి.. భారీ ఘర్షణ జరిగిందా ? అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. చైనాలో వెస్టర్న్ థియేటర్ కమాండ్ హెడ్ ఝావో జాంగ్ కీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లోని మరికొందరు అధికారులు ఇలా తమ సైనికులను రెచ్ఛగొట్టినట్టు ఈ వర్గాలు తెలిపాయి, నార్తర్న్ ఇండియా, వాయువ్య చైనాలోని వివాదాస్పద భూభాగాల పొడవునా ఈ విధమైన ‘ఆపరేషన్’ చేపట్టాలని వాళ్ళు ఆదేశించారట. ఇండియాతో గతంలో తమ సైనికుల ఘర్షణను పర్యవేక్షించిన ఝావో.. తమ దేశం ఇతర దేశాల దృష్టిలో బలహీనంగా కనిపించరాదని భావించాడట. ముఖ్యంగా ఇండియా, అమెరికా దాని మిత్ర దేశాలు తమ దేశాన్ని చులకనగా చూడరాదని ఆయన కోరుకున్నట్టు తెలుస్తోందని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇండియాకు ఓ గుణపాఠం నేర్పాలనే ఆయన… లదాఖ్ లో తమ దేశ సైనికులను ప్రోత్సహించాడని ఈ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 15 న  జరిగిన ఘర్షణకు ఇదే కారణమని అంటున్నారు. అయితే ఈ ప్లాన్ ఝావోకే బెడిసికొట్టింది. ఇండియా వైపున 20 మంది సైనికులు అమరులు కాగా.. చైనా సైనికుల్లో 35 మంది మృతి చెందారు. చైనా సైన్యానికి ఇది విజయం కాదని యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ ఘర్షణల విషయం, ఈ నిర్ణయాలు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి తెలుసా…. ఈ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉందా అన్న అంశం నిర్ధారణ కానప్పటికీ.. బహుశా అన్నీ తెలిసినా మౌనం వహిస్తున్నాడనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేటు జియో ఇంటెలిజెన్స్ సంస్థ.. ‘హాకే-360’ గత మే నెల చివరివారంలో తీసిన శాటిలైట్ ఇమేజీల్లో.. చైనా వైపున సాయుధ సైనికులు సెల్ఫ్ ప్రొపెల్డ్ఆర్టిల్లరీని తీసుకువెళ్తున్నట్టు కనిపించింది. ఈ అంశాన్ని కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తావించాయి.