సీఏఏ.. పోలీసులపై ఆందోళనకారుల దాడి… రిలీజైన నాటి చిల్లింగ్ వీడియో

సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఢిల్లీలోని చాంద్ బాగ్ ప్రాంతంలో గతనెల 24 న పోలీసులను చుట్టుముట్టి వారిపై దాడి చేస్తున్న వీడియో తాజాగా విడుదలైంది. కేవలం కొద్ధి  సంఖ్యలో ఉన్న ఖాకీలపై రెండు వేర్వేరు వీధుల్లో నుంచి వఛ్చిన వీరు.

సీఏఏ.. పోలీసులపై ఆందోళనకారుల దాడి... రిలీజైన  నాటి చిల్లింగ్ వీడియో

Edited By:

Updated on: Mar 05, 2020 | 5:57 PM

సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఢిల్లీలోని చాంద్ బాగ్ ప్రాంతంలో గతనెల 24 న పోలీసులను చుట్టుముట్టి వారిపై దాడి చేస్తున్న వీడియో తాజాగా విడుదలైంది. కేవలం కొద్ధి  సంఖ్యలో ఉన్న ఖాకీలపై రెండు వేర్వేరు వీధుల్లో నుంచి వఛ్చిన వీరు.. రాళ్లు విసురుతూ ఎటాక్ చేశారు. ఈ నిరసనకారుల్లో కొందరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే అప్పటికప్పుడు పారిపోయినట్టు నటించిన ప్రొటెస్టర్లు మళ్ళీ పరుగులు తీస్తూ వచ్చారు. వీరిలో కొందరి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. వీరి దూకుడుకు భయపడిన పోలీసులు కొందరు అక్కడి డివైడర్ పైనుంచి దూకి.. పారిపోయినంత పని చేశారు. కొందరు  దగ్గరలోని చెట్ల చాటున దాక్కున్నారు. ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులతో బాటు రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ కూడా ఆ రోజున అక్కడ ఉన్నప్పటికీ ఈ వీడియోలో వారు కనబడలేదు. అయితే అదే రోజున రతన్ లాల్ .. ఆందోళనకారుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించారు.