Viral: ముంబై వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఛత్తీస్‌గఢ్‌ వాసి.. అతడి సూసైడ్ నోట్ చదివి పోలీసులు షాక్

|

Feb 16, 2023 | 10:59 AM

అతడిది మహారాష్ట్ర కాదు.. పోనీ ముంబై వచ్చి కొంతకాలంగా జీవనోపాధి పొందుతున్నాడా అంటే అదీ లేదు. స్వరాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కి నుంచి ముంబై వచ్చి.. అదే రోజు సూసైడ్ చేసుకున్నాడు.

Viral: ముంబై వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఛత్తీస్‌గఢ్‌ వాసి.. అతడి సూసైడ్ నోట్ చదివి పోలీసులు షాక్
Police
Follow us on

ముంబైలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన లక్ష్మీ చైత్రమ్‌ అనే 25 ఏళ్ల వ్యక్తి ముంబైకి ఫ్లైట్‌లో వచ్చి కుర్లా రైల్వేస్టేషన్‌ దగ్గర్లోని ఓ బ్రిడ్జికి కండువాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యచేసుకోవడానికి ముంబై ఎందుకు వచ్చాడని ఆరాతీస్తే…ఆయన జేబులో దొరికిన ఓ లెటర్‌ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

ఫ్లైట్‌లో ప్రయాణించాలన్న తన ఆఖరికోరికను తీర్చుకునేందుకు లక్ష్మీ చైత్రమ్‌ ఛత్తీస్‌గఢ్‌ నుంచి ముంబై వచ్చాడు. అదే విషయాన్ని సూసైడ్‌ నోట్‌లో రాశాడు లక్ష్మీచైత్రమ్‌. అతడు తొలిసారి ముంబైకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనేది మాత్రం ఇంకా తెలియలేదు.

కుటుంబ సభ్యలను సంప్రదించామని తదుపరి విచారణ జరుగుతోందని చునాభట్టి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం