సహోద్యోగి కావడంతో.. ఆమె అతనితో స్నేహం చేసింది.. అదే ఆమె పాలిట మృత్యుశాపమైంది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలొస్తాయని నమ్మించాడు.. చివరకు డబ్బుల విషయంపై ఆమె నిలదీయడంతో.. మహిళను హత్యచేశాడు. అనంతరం ఆమె శవాన్ని కారు డిక్కీలో ఉంచాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం మృతదేహాన్ని ఉంచిన కారు నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. భిలాయికి చెందిన ప్రియాంక సింగ్ అనే యువతి దయాల్‌బంద్ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా.. చివరగా తన సహోద్యోగి ఆశిశ్‌తో మాట్లాడినట్లు నిర్ధారణ అయింది.
దీంతో అశిశ్ సాహూను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోరు తెరవగా.. ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని, యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
మృతుడు బిలాస్‌పూర్‌లోని ఆశిశ్ సాహు తిక్రపరా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మహిళతో స్నేహం పేరిట పరిచయమై.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె నష్టపోవడంతో.. డబ్బు లావాదేవీకి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు.
డబ్బుల కోసం యువతి నిలదీయడంతో గొంతునులిమి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడఉ. అనంతరం మృతదేహాన్ని తన కారులో ఉంచి కస్తూర్బా నగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చి అలానే ఉంచినట్లు తెలిపాడు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం..