Ankita Sharma IPS: ఆయుధ పూజరోజూ AK47తో కాల్పులు.. ఎస్పీ అంకితా శర్మకు షాక్!

దసరా వేడుకల్లో భాగంగా చేసిన ఆయుధ పూజ సమయంలో ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయుధాల వినియోగంలో భద్రతా నిబంధనలు ఉల్లగించారని ఆమెకు ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ శాఖ నోటీసులు జారీ చేసింది.

Ankita Sharma IPS: ఆయుధ పూజరోజూ AK47తో కాల్పులు.. ఎస్పీ అంకితా శర్మకు షాక్!
Ips Ankita Sharma Issued Notice Over Viral Ak 47 Firing Video

Updated on: Oct 24, 2026 | 5:46 PM

దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆయుధ పూజ తర్వాత చత్తీష్‌గడ్‌ రాష్ట్రం రజ్‌నంద్‌గావ్‌ ఎస్పీ అయినా అంకితా శర్మ చీరకట్టులోనే ఏకే 47 గన్‌తో గాల్లో కాల్పులు జరిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో అది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ వీడియోపై స్పంటించిన ఉన్నాతాధికారులు ఆయుధాల వినియోగంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్‌ 20న దసరా పండగ సందర్భంగా పోలీస్‌ లైన్స్‌లో సంప్రదాయ ఆయుధ పూజ నిర్వహించారు. అయితే పూజ తర్వాత స్థానిక ఎస్పీ అంకితా శర్మ ఒక ఏకే-47 గన్‌ తీసుకొని గాల్లోకి కొన్ని రౌండ్స్‌ కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె చర్యను కొందరు సపోర్ట్ చేయగా.. మరికొందరు వ్యతిరేకించారు. దీంతో ఈ వీడియో పోలీసు శాఖ గౌరవానికి భంగం కలిగించిందని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా నియమాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని అంకితా శర్మను ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

వీడియో చూడండి.,

మరోవైపు.. ఈ ఘటనపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.కే. విజ్‌ మాట్లాడుతూ ఆయుధ పూజలో భాగంగా కాల్పులు జరపాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అయితే,కొందరు నెటిజన్లు మాత్రం అంకితా శర్మకు సపోర్ట్‌గా నిలిచారు. ఆయుధాల వినియోగంలో లోపాలు ఉంటే సరిదిద్దాలని, వాటి ఆధారంగా ఆమె వృత్తిపరమైన సేవలను తక్కువ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us