Chhattisgarh Election: కాంగ్రెస్ గెలిచినా, ముఖ్యమంత్రి పదవి కష్టమేనా..? ప్రకంపనలు సృష్టిస్తున్న TS సింగ్ దేవ్ వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల ఓటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని ప్రధాన పార్టీలతో సహా ప్రజలంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? లేక భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందా ? అనేది డిసెంబర్ 3న తేలిపోతుంది.

Chhattisgarh Election: కాంగ్రెస్ గెలిచినా, ముఖ్యమంత్రి పదవి కష్టమేనా..? ప్రకంపనలు సృష్టిస్తున్న TS సింగ్ దేవ్ వ్యాఖ్యలు
Bhupesh Baghel, Ts Singh Dev

Updated on: Nov 19, 2023 | 9:21 AM

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల ఓటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని ప్రధాన పార్టీలతో సహా ప్రజలంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? లేక భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందా ? అనేది డిసెంబర్ 3న తేలిపోతుంది. అంతకంటే ముందే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి డిమాండ్ మొదలైంది. ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్ తాజాగా చేసిన సంచలక ప్రకటన కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితిని సృష్టించింది. టీఎస్ సింగ్  దేవ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

తాను ముఖ్యమంత్రి కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని టీఎస్‌ సింగ్‌ దేవ్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి అయ్యే మార్గం సులభతరంగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే తనకు చివరి అవకాశం అని టీఎస్ సింగ్ దేవ్ అంటున్నారు. ఇది జరగకపోతే తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు, పోటీ చేయను అని తేల్చి చెప్పారు టీఎస్ సింగ్. ఓటర్లు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఫలితాలు కాకుండానే పదవుల కోసం మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.

అంతేకాదు, ఇవి మనస్సులోని భావాలు, మనస్సులో ఉంచుకున్నవి అని టిఎస్ సింగ్ దేవ్ అన్నారు. శారీరకంగా పని చేసే అవకాశం వస్తే సంతోషంగా చేసుకుంటూ పోతానన్నారు. అదే సమయంలో ఎక్కడ పని చేసే అవకాశం వచ్చినా చేస్తానని చెప్పారు. టీఎస్ సింగ్ దేవ్ మాట్లాడుతూ, ‘ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా చేయగలిగినంత పని చేశాను. ప్రతిపక్ష నాయకుడిగా పని చేసే అవకాశం వచ్చినప్పుడుపూర్తి సహకారం అందించాను. మంత్రిగా కూడా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాను. భవిష్యత్తులో ప్రజలు ఏది చెబితే అది చేస్తాం.’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నవంబర్ 7న 20 స్థానాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాల్లో రెండో దశ పోలింగ్ నవంబర్ 17న నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు ఐదు రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…