Kagar Eagle Team: కారడవిలో ఆపరేషన్‌ కగార్‌.. బస్తర్‌లో అలజడికి బాట చూపిందెవరు?

|

Oct 07, 2024 | 6:10 AM

రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ వెనుక ఎవరూ ఊహించని స్కెచ్‌ వుందా? బస్తర్‌లో అలజడికి బాట చూపిందెవరు? మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ సంకల్పానికి గరుడ సాయం ఊతమైందా? మేడిన్‌ తెలంగాణ స్వ్కాడ్‌ సత్తా అంతలా వుందా?

Kagar Eagle Team: కారడవిలో ఆపరేషన్‌ కగార్‌.. బస్తర్‌లో అలజడికి బాట చూపిందెవరు?
Encounter
Follow us on

రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ వెనుక ఎవరూ ఊహించని స్కెచ్‌ వుందా? బస్తర్‌లో అలజడికి బాట చూపిందెవరు? మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ సంకల్పానికి గరుడ సాయం ఊతమైందా? మేడిన్‌ తెలంగాణ స్వ్కాడ్‌ సత్తా అంతలా వుందా? అనే చర్చ జరుగుతోందిప్పుడు.

మూవోయిస్టు ముక్త్‌ భారత్‌ సంకల్పంగా బస్తర్‌లో ఎన్‌కౌంటర్ల పర్వం సాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ దేశంలోనే రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌. అబూజ్‌మఢ్‌ అడవుల్లో దంతెవాడ, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో మావోయిస్టుల క్యాంప్‌పై DRG బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు హతమయ్యారు. గత 8 నెలల్లో 188 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.మావోయిస్టులకు గట్టి పట్టున్న దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌కు దారి చూపిందెవరు?

కళ్లతో కాదు డేగ కాళ్లతో అడవిని జల్లెడ..!

చెట్టుపై పిట్టకు గురిపెట్టినట్టుగా మావోయిస్టు స్థావరాలను పోలీస్‌ బలగాలు ఎలా పసిగట్టాయి?. కూంబింగ్‌ ఆపరేషన్లు దండకారణ్యంలో మాములే. కానీ ఇప్పట్లా ఈ స్థాయి భారీ ఎన్‌కౌంటర్‌కు ఎన్నడూ బాట దొరకలేదు. మరిప్పుడు అదేలా సాధ్యమైంది?.. పోలీసు బలగాలు కళ్లతో కాదు డేగ కాళ్లతో దండకారణ్యాన్ని జల్లెడపట్టాయా?డేగ కాళ్లే ఆపరేషన్‌ కగార్‌కు నిఘా కళ్లయ్యాయా? ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఇంత పెద్ద ఎన్‌కౌంటర్‌కు దారి చూపింది నిఘా ఆపరేషన్స్‌లో రాటుదేలిన గరుడ పక్షులా?.. కగార్‌ కా పీఛే ఈగల్‌ స్వ్కాడ్‌ సీక్రెట్‌ మిషన్‌ వుందా? అంటే అవునంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు.

రంగంలోకి గరుడ టీమ్స్‌.. !

పాత రోజుల్లో పావురాలతో రాయబేరం పంపేవాళ్లు. ఆ కాన్సెప్ట్‌కు పోలీసులు మరింత పదను పెట్టి గరుడ టీమ్స్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌ సహా పలు దేశాల్లో మిలటరీ, నిఘా ఆపరేషన్స్‌లో ఈగల్‌ స్వ్కాడ్‌ ను వాడుతున్నారు. అసాంఘీశ శక్తుల కార్యకలాపాలను పసిగట్టడంలో ఈగల్‌ స్వ్కాడ్‌ ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది కూడా . డ్రోన్లతో గాలిస్తే యాంటి సోషల్‌ ఎలిమెంట్స్ అప్రమత్తమయ్యే చాన్స్‌ వుంది. అదే గరుడ కాళ్లకు హిడెన్‌ కెమెరాలను అమర్చి ఎగరేస్తే.. విజిలేసినంత ఈజీగా దట్టమైన అడవిలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలా ఆపరేషన్‌ కగార్‌కు ఇన్‌ఫార్మర్‌ నెట్‌వర్క్‌ కారణమనేది ఒక వాదనయితే. ఈగల్‌ స్వ్కాడ్‌ ఎత్తుగడను వాడారనేది మరో కోణం.

డేగ కాళ్లకు నిఘా నేత్రాలు.. దారి చూపేలా GPS

అంతేకాదు సైనిక స్థావరాలపైన ఎవరైనా డ్రోన్‌లు ఎగరేస్తే వాటిని పసిగట్టి ధ్వంసం చేసేలా తర్ఫీదునిచ్చి ఈగల్‌ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. చాలా దేశాల్లో ఈగల్‌ స్వ్కాడ్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా ఈగల్‌ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌, మొయినా బాద్‌లో శిక్షణ ఇచ్చారు. హోంశాఖ సూచనల మేరకు దండకారణ్యంలో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో తెలంగాణ ఈగల్‌ స్వ్కాడ్‌ సేవలను వినియోగించుకున్నారనే చర్చ జరుగుతోంది. గరుడ పక్షి కాళ్లకు అమర్చిన హిడెన్‌ కెమెరాలు,జీపీఎస్‌ ట్రాకర్‌ సాయంతోనే పోలీస్‌ బలగాలు మావోయిస్టుల స్థావరాలను గుర్తించి చుట్టిముట్టాయనేది చర్చల సారాంశం. మావోయిస్ట్‌ ముక్‌ భారత్‌ సంకల్పంగా కేంద్రం గ్రే హౌండ్స్‌ తరహాలో .సీఆర్పీఎఫ్‌ దళాల నుంచి మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి కోబ్రా బెటాలియన్లను రూపొందించింది. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతోన్న కోబ్రా దళాలకు , తెలంగాణ ఈగల్‌ టీమ్‌ దిక్సూచిగా మారిందనే టాక్‌ విన్పిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..