
Chhattisgarh Assembly Elections Exit Poll Results 2023: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నాయి. అయితే, మళ్లీ హస్తం పార్టీకే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఇక్కడ పోలింగ్ జరిగింది. తొలి విడతలో 20 స్థానాలు, 70 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 958 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో మాజీ సీఎం అజిత్ జోగి జనతా కాంగ్రెస్, BSP ప్రభావం కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ డివిజన్‌లో అభ్యర్థులను నిలిపింది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో బీజేపీ తరపున ఆయన సమీప బంధువు విజయ్ బఘేల్ తలపడ్డారు. అజిత్ జోగి జనతా కాంగ్రెస్ తరపున అమిత్ జోగి కూడా సీఎంతో తలపడ్డారు. గిరిజన జనాభా అధికంగా ఉంటే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలున్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్లు ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ పాలించింది.
అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య హోరాహోరి ఫైట్ నెలకొన్నట్లు వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్ లోని 90 స్థానాల్లో కాంగ్రెస్ 40-50, బీజేపీ 35-45, ఇతరులు 0-3 మధ్య సీట్లు వస్తాయని.. పోల్ స్ట్రాట్ సర్వే వెల్లడించింది.
పీపుల్స్ పల్స్ : బీజేపీ 29-39, కాంగ్రెస్ 54-64, ఇతరులు 2
ఇండియా టుడే: బీజేపీ 36-46, కాంగ్రెస్ 40-50, ఇతరులు 0-5
సీఎన్‌ఎన్ న్యూస్ 18: బీజేపీ 41, కాంగ్రెస్ 46, ఇతరులు 3
జన్ కీ బాత్ : బీజేపీ 34-45, కాంగ్రెస్ 42-53,
ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ : బీజేపీ 30-40, కాంగ్రెస్ 46-56
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..