ఆటబొమ్మ అనుకొని పామును నోట్లో పెట్టుకొని నమిలిన చిన్నారి.. తర్వాత ఏం జరిగిందంటే!

మనకు సడెన్‌గా పాము కనిపిస్తే ఏం చేస్తాం.. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెడతాం.. కానీ ఇక్కడో చిన్నారి ఏం చేసిందో తెలుస్తే షాక్‌ అవుతారు. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ముందుకు వచ్చిన పామును ఆట బొమ్మగా భావించిన ఆ చిన్నారి.. దాన్ని నోట్లో పెట్టుకొని నమిలి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆటబొమ్మ అనుకొని పామును నోట్లో పెట్టుకొని నమిలిన చిన్నారి.. తర్వాత ఏం జరిగిందంటే!
Chhattisgarh Viral Video

Updated on: Aug 16, 2025 | 5:00 PM

ఇంట్లోకి వచ్చిన పాము పిల్లలను ఆటబొమ్మగా భావించిన ఒక తొమ్మిది నెలల చిన్నారి.. దాన్ని నోట్లో పెట్టుకొని నమిలి చంపేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పరాప పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయ్నార్ గ్రామానికి చెందిన 9 నెలల చిన్నారి మాన్వి గదిలో ఆడుకుంటోంది. ఆమె తల్లి దీపిక అనారోగ్యం కారణంగా పక్క రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటోంది. కుటుంబంలోని ఇతర సభ్యులు పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో మాన్వి ఇంట్లోనే ఆడుకుంటూ ఉంది.. అయితే ఇంట్లోని తలుపు వెనుక దాగి ఉన్న విషపూరిత క్రైట్ పాము గదిలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మెళ్లగా వెళ్తోంది.

దాని గమనించిన మాన్వి.. ఆ పామును ఆట బొమ్మగా భావించి వెంటనే పట్టుకొని నోట్లో పెట్టుకుంది. ఆ తర్వాత దాన్ని కొరకడం ప్రారంభించింది. దీంతో కాసేపటికే పాము చనిపోయింది. కాసేపటి తర్వాత బిడ్డ ఏం చేస్తుందో చూద్దామని బయటకు వచ్చిన తల్లి.. పాప నోట్లో పామును చూసి షాక్‌కు గురైంది. భయపడిపోయి వెంటనే బాలిక చేతిలోని పామును లాగి పడేసింది. ఆ వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు మాన్విని జగదల్‌పూర్‌లోని మెకాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!

బాలికను పరీక్షించిన వైద్యులు 24 గంటల పాటు మాన్విని ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత మాన్వి పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత రోజు మాన్విని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. బాలిక పామును నోట్లో పెట్టుకొని నమిలిన కొంత సేపటికే అది చనిపోయి ఉండవచ్చని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తర్వాత గ్రామంలోని ప్రజలందరూ మాన్విని ప్రేమగా “చిన్న సింహరాశి” అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: ఫ్యామిలీకి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. ఉద్యోగం ఊడగొట్టుకున్న పైలట్‌.. ఎం చేశాడంటే!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..