Yamuna River Viral Video: ఆకాశగంగలో పొంగుతున్న పాలపొంగులు కావివి.. హిమగిరుల్లో తేలియాడుతున్న మంచు పలకలు అసలే కావు.. మీరు చూస్తున్నది విషపు నురగలు. అవును మీరు చూస్తున్నది యమునా నదిలోని దృశ్యాలు.. ఆ నీటిలోనే మహిళలు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం చూసి.. పలువురు నీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సోమవారం దేశమంతటా కార్తీకమాస పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే సుప్రసిద్ధ నదుల వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో భాగంగా ఉత్తరభారతదేశంలో ఛత్‌పూజలు కూడా ప్రారంభయ్యాయి. అయితే.. దేశరాజధాని ఢిల్లీలోని మహిళలు యమునా నదికి చేరుకొని కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా యమునా నదిలో కనిపించిన దృశ్యాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
#WATCH | People take dip in Yamuna river near Kalindi Kunj in Delhi on the first day of #ChhathPuja in the midst of toxic foam pic.twitter.com/uMsfQXSXnd
— ANI (@ANI) November 8, 2021
#WATCH | Toxic foam floats on Yamuna river near Kalindi Kunj in Delhi pic.twitter.com/aB8LGRiHFo
— ANI (@ANI) November 8, 2021
అమ్మోనియా స్థాయి పెరగడం, వ్యర్థాల వల్ల విషపు నురగలు ఈవిధంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. హర్యానా నుంచి ఎక్కువగా వ్యర్థాలు యమునాలో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. విషపు నురగల దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
People take dip in Yamuna river near Kalindi Kunj in Delhi on the first day of #ChhathPuja amid toxic foam pic.twitter.com/nrmzckRgdq
— ANI (@ANI) November 8, 2021