Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!

Tamil Nadu: అందం అభినయంతో.. హనీ ట్రాప్ ముసుగులో ఇంతవరకు అమ్మాయిలు, అబ్బాయిలను మోసం చేయడం చూశాం.

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!
Man Honey Trap

Updated on: Mar 22, 2022 | 9:44 PM

Tamil Nadu: అందం అభినయంతో.. హనీ ట్రాప్ ముసుగులో ఇంతవరకు అమ్మాయిలు, అబ్బాయిలను మోసం చేయడం చూశాం. తమిళనాడులో ఓ యువకుడు ట్రెండ్ మార్చాడు. కండలు తిరిగిన దేహంతో అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. పదుల సంఖ్యలో యువతులను ట్రాప్ చేశాడు. కండల కావరంతో జైలు పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కండలు తిరిగిన దేహం.. మోడలింగ్ వృత్తి. ఇంకేముంది.. అమ్మాయిలను ఇట్టే ట్రాప్ చేయడం మొదలపెట్టాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మందికి పైగా యువతులను మోసం చేశాడు. చివరకు కండల కావరంతో జైలు పాలయ్యాడు. ఇది తమిళనాడుకు చెందిన మోడలింగ్ మహ్మద్ సయ్యద్ భాగోతం.

చేసేది మోడలింగ్ వృత్తి .. జిమ్ లో కసరత్తులు చేసిన వీడియోలతో అమ్మాయిలను వలలో వేసుకోవడం ప్రారంభించాడు. మంచి ఫిజిక్ తో అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. గంటల తరబడి వర్కౌట్లు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా యువతులను ఆకట్టుకోవడం పనిగా పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. అశ్లీల వీడియోలను చిత్రీకరించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఇంకొంతమందిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని, కళ్లుచెదిరే డబ్బు వస్తుందని నమ్మించి ఆశచూపాడు. చివరకు అమ్మాయిల వీక్ నెస్ ను పసిగట్టి వారిని నట్టేట ముంచాడు. అయితే వెప్పేరికి చెందిన ఓ యువతి ఓ అడుగు ముందుకేసింది. అతని కండల భాగోతాన్ని బయటపెట్టింది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. చివరకు కండలు బంటు మోసపు భాగోతం బయటపడింది. అతని ఫోన్‌లో ఎంతో మంది యువతుల అశ్లీల వీడియోలు ఉండడం చూసి పోలీసులు కంగుతున్నారు. వారి స్టయిల్ ట్రీట్‌మెంట్‌కి తన చేతిలో బలైన అమ్మాయిల లిస్ట్ మొత్తం కక్కేశాడు. మొత్తంగా 20 మందికి పైగా ఈ సయ్యద్ చేతిలో మోసపోయినట్టు గుర్తించారు పోలీసులు.

Also read:

RUSSIA-UKRAINE WAR: యుక్రెయిన్ రాజధానికి ఆ నది వల్లే రక్షణ.. రష్యా ప్లాన్ బీకి దారితీసిన పరిణామాలు ఇవే.. అందుకే మేరియుపోల్ లక్ష్యం

Women Protest – Gas Price Hikes: వంటింట్లో గ్యాస్ ధరల మంట.. భగ్గుమన్న మహిళా లోకం.. రోడ్డుపైకి వచ్చి..

Viral photo: ఈ ఫోటోలో ముందుగా మీకు ఏం కనిపిస్తుందో చెప్పగలరా.. ఠక్కున చూసేదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుం..