నివార్ తుపాను నేపథ్యంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి గురువారం ఉదయం 7 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలను నిలిపివేశారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నివార్ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినాశ్రయ అధికారులు తమ ఉత్తర్వులో పేర్కొన్నారు. మరోవైపు తుపాను కారణంగా మెట్రో సేవలను సైతం నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల్లోపు అన్ని మెట్రో ష్టేషన్లలో మెట్రో రైళ్లను నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇదిలాఉండగా, నివార్ తుపాను నేపథ్యంలో తమిళనాడులోని 13 జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై, వెల్లోర్, కడ్డలూర్, విల్లుపురం, నాగపట్టినం, తిరువారుర్, చెంగల్‌పట్, కాంచీపురం, తంజావూర్ సహా 13 జిల్లాల్లో సెలవు ప్రకటించారు. దక్షిణ రైల్వే సైతం పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది.