ఏనుగులు గ్రామాలపై పడి స్థానికులపై దాడులు చేస్తూ.. పంటలను, తోటలను ధ్వంసం చేస్తుండడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఎలిఫెంట్ మేనేజిమెంట్ కింద వరి పంటను వాటికోసం ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ నరసింగా రావుకు లేఖ రాసింది. దీని ప్రకారం రాయపూర్, బిలాస్ పూర్, సూరజ్ పూర్ జిల్లాల నుంచి క్వింటాలుకు సుమారు రెండు వేల చొప్పున వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ సూచించింది. అయితే ఏయే జిల్లాలకు ఎంతెంత అన్నది ఇంకా తేల్చలేదు.. మొదట ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని నరసింగా రావు వెల్లడించారు. ఆహరం కోసం అడవుల నుంచి వచ్చే ఏనుగులు గ్రామాలపై పడి గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయని,, పంటలను నాశనం చేస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్లే గ్రామాల బయటే వాటికీ ఆహారం లభించేలా చూస్తే ఇక అవి పల్లెల్లో ఎంటర్ కావన్నారు. అయితే కేవలం వరి ధాన్యాన్ని వాటికీ ఆహారంగా పెట్టడం వల్ల వాటికి అనారోగ్యం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవుల్లో అవి చెట్ల దుంపలను, చివరకు కాయ ధాన్యాలను కూడా తింటాయని వారు చెబుతున్నారు. వరి ధాన్యం వల్ల వాటి ఆకలి తీరదని వారు పేర్కొన్నారు.
కాగా గత మూడేళ్ళలో ఈ రాష్ట్రంలో ఏనుగుల దాడుల్లో 204 మంది మరణించారు. రాష్ట్రంలో సుమారు 300 ఏనుగులు ఉన్నాయని అంచనా.. అటు-ఏపీలోని చిత్తూరు తదితర జిల్లాల్లో కూడా ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )
పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.