Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ అజేయ సెంచరీ.. కీలక అప్‌డేట్ షేర్ చేసిన ఇస్రో

|

Sep 02, 2023 | 4:08 PM

చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రేవర్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ పయనం సాఫీగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. చంద్రుడిపై రోవర్‌ అజేయ సెంచరీ కొట్టింది.

Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ అజేయ సెంచరీ.. కీలక అప్‌డేట్ షేర్ చేసిన ఇస్రో
Chandrayaan-3 Mission
Follow us on

Pragyan Rover: గగన వీధుల్లో ఇస్రో తన సత్తా చాటుతోంది. అటు జాబిల్లిపై చంద్రయాన్-3 ప్రయోగంతో లోతైన పరిశోధనలు కొనసాగిస్తూనే.. మరోవైపు సూర్యడికి సంబంధించిన ఆసక్తికర అంశాలను కనిపెట్టే లక్ష్యంతో ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించింది. రెండు చారిత్రక ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు.. యావత్ ప్రపంచ దృష్టిని తమ వైపునకు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రేవర్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ పయనం సాఫీగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

చంద్రుడిపై రోవర్‌ అజేయ సెంచరీతో అదరగొట్టింది. జాబిల్లిపై రోవర్ విజయవంతంగా 100 మీటర్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని.. తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఇది మరో మైలురాయిగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోవర్ ఏ మార్గంలో ప్రయాణించిందన్న వివరాలతో కూడిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్స్ (పాతపేరు ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. ప్రజ్ఞాన్ రోవర్‌ ఇప్పటికే చంద్రుడిపై ఆక్సిజన్‌తో పాటు పలు రకాల ఖనిజాలను కనుగొనడం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

చంద్రుడిపై 100 మీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రోవర్..

ఆదిత్య సీ1 ప్రయోగం విజయవంతం.. 

కాగా సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం శనివారం మధ్యాహ్నం శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టి ఆదిత్య సీ1 ప్రయోగం విజయవంతమయ్యింది. ఆదిత్య సీ1 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో తెలిపింది. సన్ మిషన్ విజయవంతం కావడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ మిషన్‌లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందలు తెలిపారు. మానవాళికి ప్రయోజనకరమైన రీతిలో విశ్వాంతరాలను కనిపెట్టేందుకు ఇస్రో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఇస్రోకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ..

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..