బెంగళూరు, జులై 19: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈనెల 14న తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. వీరి పర్యవేక్షణలో ఈస్పేస్ క్టాఫ్ట్ సేఫ్‌గా ప్రయాణిస్తోంది. భూమి చుట్టూ విజయవంతంగా చంద్రయాన్ 3 ఉపగ్రహం ప్రదక్షిణలు చేస్తూ ఉంది. చంద్రయాన్ 3ని ఎప్పటికప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇస్ ట్రాక్ (istract) సెంటర్ నుంచి నియంత్రణ చేస్తున్న సంగతి తెలసిందే. చంద్రయాన్ 3 ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండిస్తూ రైజింగ్ ఆపరేషన్ ద్వారా ఆపోజి (భూమి నుంచి దూరాన్ని) పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు రెండుసార్లు ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు.
మంగళవారం సాయంత్రం మూడవ ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ కూడా విజయ వంతంగా పూర్తి చేశారు. బెంగళూరులోని ఇస్ ట్రాక్ సెంటర్ వద్ద మూడవ ఆర్బిట్ రైసింగ్ ఆపరేషన్ లను మంగళవారం సాయంత్రం విజయవంతంగా పూర్తి చేశారు. భూమికి అతి దూరంగా అంటే దాదాపుగా 52,000 కిలోమీటర్ల దూరం వైపు చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని పంపుతూ చంద్రునికి దగ్గరగా చేర్చడం జరుగుతూ ఉంది. ఇలాంటి రైజింగ్ ఆపరేషన్‌లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇంకా మరి కొన్ని దశల్లో చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని చంద్రునికి దగ్గరగా పంపుతారు. ఇలా ప్రొఫల్సన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని కక్ష పైకి దింపడంలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కాగా చంద్రయాన్ 3 వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లూదా 24న చంద్రుడిపై అడుగుమోపనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.