New Delhi: జైళ్లలో వారిపై ఓ కన్నేయండి… జైళ్లలో ఉగ్రవాదం పెరగడంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

జైళ్లలో ఉగ్రవాదం పెరగడంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఉగ్రవాదం తీవ్రమైన సవాలుగా మారిందని హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఖైదీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఆదేశించింది. సామాజిక ఒంటరితనం, జైళ్లలో...

New Delhi: జైళ్లలో వారిపై ఓ కన్నేయండి... జైళ్లలో ఉగ్రవాదం పెరగడంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
Ministry Of Home

Updated on: Jul 14, 2025 | 10:45 AM

జైళ్లలో ఉగ్రవాదం పెరగడంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఉగ్రవాదం తీవ్రమైన సవాలుగా మారిందని హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఖైదీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఆదేశించింది. సామాజిక ఒంటరితనం, జైళ్లలో పర్యవేక్షణ లేకపోవడంతో ఉగ్రవాదం పెరిగే అవకాశముందని హోంశాఖ అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో ఖైదీలు జైలు సిబ్బందిపై లేదా ఇతర ఖైదీలపై దాడి చేయాలని యోచిస్తున్నారు. ఇకపై స్క్రీనింగ్‌లో మానసిక, సామాజిక ఆరోగ్య అంచనా కూడా వేయాలని సూచించింది.

ఉగ్రవాదాన్ని నివారించడానికి కౌన్సెలింగ్, విద్య, పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సమాజంతో తిరిగి కలిసిపోయేలా తీర్చిదిద్దాలని.. దిద్దుబాటు చర్యలు, ఆచరణాత్మక పునరావాసంతో ఉగ్రవాద మనస్తత్వాన్ని మార్చాలంటూ రాష్ట్రాలకు సూచించింది.

ఇటీవల బెంగళూరు సెంట్రల్‌ జైలులో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. లష్కరే తొయిబా కర్ణాటక జైళ్లను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది బెంగళూరు సెంట్రల్‌ జైలులో ఏకంగా నెట్‌వర్క్‌నే నిర్వహిస్తూ, దాడులకు ప్లాన్‌ వేస్తుండటం పట్ల అధికారులే షాక్‌ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లను ఎన్‌ఐఏ అప్రమత్తం చేసింది. బిహారీలను ఉంచిన జైళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హెచ్చరించింది. సిబ్బందిలోకి ఉగ్రవాద భావజాలాన్ని చొప్పించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.