OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..

|

Feb 03, 2021 | 4:45 AM

OBC Creamy Layer: ఓబీసీ క్రీమీలేయర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో కేంద్రం చేసిన..

OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..
Parliament session updates
Follow us on

OBC Creamy Layer: ఓబీసీ క్రీమీలేయర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో కేంద్రం చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. దేశంలో వెనుబడిన తరుగతుల వారికి ఆదాయ పరిమితిని(ఓబీసీ క్రీమీలేయర్) పెంచాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి నిర్ణయాలపై కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు పలు ప్రశ్నలు వేశారు. దీనికి స్పందించిన కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృపన్‌పాల్ గుర్జాన్.. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పటికే జాతీయ వెనుకబడిన తరగతుల సంఘాలతో సంప్రదింపులు జరిపామన్నారు. వారితో చర్చల తరువాతే ఓబీసీ క్రీమీలేయర్ పరిమితిని పెంచాలని ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఓబీసీల ఆదాయ పరిమితి రూ. 8 లక్షలుగా ఉందని, త్వరలోనే దినిని పెంచుతామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ఆదాయ పరిమితి పెంచినట్లయితే దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఓబీసీలకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో లబ్ధి పొందగలుగుతారు.

Also read:

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు మళ్లీ మంచిరోజులు, ప్రెసిడెంట్ బైడెన్ నేతృత్వంలో కొత్త అడుగులు

Central Govt: ఆ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయాధికారం.. లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..